సినిమా వార్తలు

కుమార్తె ప్రేమకు వెంకటేష్ గ్రీన్‌సిగ్నల్


10 months ago కుమార్తె ప్రేమకు వెంకటేష్ గ్రీన్‌సిగ్నల్

మల్టీస్టారర్  చిత్రాల హీరో విక్టరీ వెంకటేష్ వైవిధ్యం ఉన్న పాత్రలని ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలో జరగబోతున్నట్లు ఒక ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. కుమార్తె ప్రేమకు పచ్చజెండా పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపారని సమాచారం. ఆమెకు పరిచయం ఉన్న యువకుడితో ఆర్షిత ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుడు  హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడని తెలుస్తోంది.

ఇరువురూ ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు వివాహానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవలే వెంకీ సోదరుడు సురేష్ బాబు ఇటీవలే అబ్బాయి కుటుంబ సభ్యులను కలసి, పెళ్ళికి సంబందించిన విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహం వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ ప్రస్తుతం ఎఫ్2 షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఇది పూర్తికాగానే రాగానే వివాహానికి సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.