సినిమా వార్తలు

అక్టోబర్ 11న ‘అరవింద సమేత’


12 months ago అక్టోబర్ 11న ‘అరవింద సమేత’

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈషా రెబ్బా, జగపతిబాబు, నాగబాబు కీలకపాత్రల్లో నటించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాథాకృష్ణ(చినబాబు) నిర్మించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. 

దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే నిర్మాత ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుక తేదీని చిత్ర యూనిట్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  అక్టోబర్ 1 లేదా 2వ తేదీన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.