సినిమా వార్తలు

అంత‌రిక్షంలోని విశేషాలివే!


9 months ago అంత‌రిక్షంలోని విశేషాలివే!

‘ఫిదా’, ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘అంతరిక్షం’. స్పేస్ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే నెల‌కొన్నాయి. ఈ సినిమా గురించి ఇండస్ట్రీ కూడా ఆసక్తిక‌రంగా ఎదురు చూస్తోంది. కొత్త కథలకు మంచి ఆద‌ర‌ణ ఉన్న‌ ఈ సమయంలో తన హ్యాట్రిక్ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ ఈ కథను ఎంపిక‌చేసుకున్నాడు. ‘ఫిదా’, ‘తొలిప్రేమ’ తర్వాత వరుణ్ తేజ్ నటించిన సినిమా ‘అంతరిక్షం’. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 600 స్క్రీన్స్‌లో విడుదల అవుతోంది. లావ‌ణ్య త్రిపాఠి, అదితిరావ్ హైద్రీ, సత్యదేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల,క‌్రిష్ జాగ‌ర్ల‌మూడి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టించారు. 2 గంటల 30 నిమిషాల నిడివితో ఈ సినిమాను రూపొందించారు. ట్రైలర్‌తోనే తాను ఏం ఆవిష్క‌రించ‌బోతున్నాడో చూపించాడు ద‌ర్శ‌కుడు. తెలుగు ఇండ‌స్ట్రీలో తొలి స్పేస్ నేప‌థ్యం ఉన్న సినిమా ఇదే. ఇప్ప‌టికే త‌మిళ‌నాట "టిక్ టిక్ టిక్" ఈ జోన‌ర్ లోనే వ‌చ్చింది. జ‌యంర‌వి హీరోగా వ‌చ్చిన ఈ చిత్రాన్ని శ‌క్తి సౌంద‌ర‌రాజ‌న్ తెర‌కెక్కించాడు. అయితే అది ఫ్లాప్ అయింది. కానీ ఇప్పుడు సంక‌ల్ప్ రెడ్డి మాత్రం "అంత‌రిక్షం" సినిమాను చాలా జాగ్ర‌త్త‌గా తెర‌కెక్కించారంటున్నారు.

కక్ష్య నుంచి దారి తప్పి వెళ్తున్న ఓ శాటిలైట్ కోడ్ చేసే వ్యోమగామి పాత్రలో వరుణ్ తేజ్ నటించాడు. "ఘాజీ"తో జాతీయ అవార్డు అందుకున్న సంక‌ల్ప్ రెడ్డి.. రెండో ప్ర‌య‌త్నంగా "అంత‌రిక్షం" చిత్రాన్ని తెర‌కెక్కించాడు. జీరో గ్రావిటీలో ప్ర‌త్యేకంగా డిజైన్ చేసిన స్పేస్ సెట‌ప్‌లో "అంత‌రిక్షం" సినిమాను చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు సంక‌ల్ప్ రెడ్డి. ఈ చిత్రం కోసం అత్యున్న‌త సాంకేతిక విభాగం ప‌ని చేసారు. హాలీవుడ్ యాక్ష‌న్ నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో అంత‌రిక్షం చిత్రానికి యాక్ష‌న్ ఎపిసోడ్స్ చిత్రీక‌రించారు. విజువ‌ల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్ర‌ధానాక‌ర్ష‌ణ‌. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 21 కోట్ల బిజినెస్ చేసింద‌ని తెలుస్తోంది.