సినిమా వార్తలు

'అంతరిక్షం' లో వ్యోమ‌గామి వరుణ్ తేజ్


1 year ago 'అంతరిక్షం' లో వ్యోమ‌గామి వరుణ్ తేజ్

వరుణ్ తేజ్ విభిన్నమైన కథాచిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా తాజాగా ఆయన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' సినిమా చేస్తున్నాడు. వ్యోమగామిగా వరుణ్ తేజ్ నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన కథానాయికలుగా అదితీరావు .. లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అద్భుతమైన ఈ అనుభవాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు. తెలుగులో పూర్తిస్థాయి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే. తెలుగులో మొదటిసారిగా 'జలాంతర్గామి' నేపథ్యంలో 'ఘాజీ' సినిమాను తెరకెక్కించిన రికార్డు ఆల్రెడీ సంకల్ప్ రెడ్డి పేరు మీద వుంది. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన చేసిన ఆ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. 'అంతరిక్షం' విషయంలోను అలాగే జరుగుతుందేమో చూడాలి మరి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.