సినిమా వార్తలు

`అంత‌రిక్షం` కోసం మ‌రింత ఖ‌ర్చుపెట్టాల్సుంది


9 months ago `అంత‌రిక్షం` కోసం మ‌రింత ఖ‌ర్చుపెట్టాల్సుంది

విభిన్న త‌ర‌హా సినిమాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌డానికి ఇష్ట‌ప‌డే మెగాహీరో వ‌రుణ్ తేజ్ చేసిన తాజా చిత్రం `అంత‌రిక్షం`. స్పేస్ సైన్స్ నేప‌థ్యంలో రూపొందించిన‌ ఈ సినిమా ఇటీవ‌లె ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ఫ‌లితం గురించి వ‌రుణ్ తాజాగా  స్పందించాడు. `అంత‌రిక్షం` డ‌బ్బులొచ్చే సినిమా కాద‌ని ముందే తెలుసని అన్నాడు. ``అంత‌రిక్షం` లాంటి సినిమాకు ఎంత ఖ‌ర్చైనా పెట్టొచ్చు. మ‌రో వంద రోజులైనా అద‌నంగా పనిచెయ్యొచ్చు. కావాల‌నే ఈ ప్రాజెక్టుకు బ‌డ్జెట్ ప‌రిమితులు పెట్టుకున్నాం. ఎక్కువ డ‌బ్బులు రావ‌ని ముందుగానే అనుకున్నాం. త‌క్కువ బ‌డ్జెట్ పెడితేనే సేఫ్ అని భావించాం. రిజ‌ల్ట్ కూడా అలాగే ఉంది. అయితే ఈ సినిమాకు మ‌రో ప‌ది కోట్ల రూపాయ‌లు అద‌నంగా పెట్టుంటే బాగుండేది. కొన్ని సీన్లు మ‌రింత ఎఫెక్టివ్‌గా ఉండేవి` అంటూ వ‌రుణ్ త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు.