సినిమా వార్తలు

నేడు అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్న వర్మ


8 months ago నేడు అందరినీ సర్‌ప్రైజ్ చేయనున్న వర్మ

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న రామ్ గోపాల్ వర్మ, ఈ రోజు ఒక కీలక ప్రకటన చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే తన సోషల్ మీడియా ఖాతాలో స్వయంగా ప్రకటించారు. "ఎన్టీఆర్ వర్థంతి అయిన జనవరి 18న సాయంత్రం 5 గంటలకు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ప్రాణం పోసుకోబోతోంది" అని వర్మ తెలిపారు. అయితే వర్మ ఈ చిత్రం ప్రీ లుక్ ను విడుదల చేస్తారా? ట్రైలర్ రిలీజ్ చేస్తారా? టీజర్ విడుదలవుతుందా? అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. వర్మ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతుండగా, ఆయన చేసే ప్రకటన కోసం ఆత్రుతతో ఎదురు చూస్తున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.