సినిమా వార్తలు

బాలయ్య, నాగబాబు వివాదంపై స్పందించిన వర్మ


8 months ago బాలయ్య, నాగబాబు వివాదంపై స్పందించిన వర్మ

మెగాస్టార్ కుటుంబంపై గతంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌  చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా నాగబాబు ప్రస్తుతం వీడియోలు విడుదల చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు వీడియోలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ట్విట్టర్ లో వర్మ.. ‘కామెంట్లు చేయ‌డంలో న‌న్ను మించిపోయార‌నే నా బాధ ఒక‌వైపు.. త‌న స్టార్ బ్ర‌ద‌ర్స్‌ను స‌మ‌ర్థించ‌డంలో సూప‌ర్‌స్టార్ అయిపోయార‌న్న ఆనందం మరోవైపు.. ఒక కంట క‌న్నీరు, మ‌రో కంట ప‌న్నీరు. నాగ‌బాబు గారూ హ్యాట్సాఫ్‌.. మీ సోద‌రుల‌ను మీరు ఎంత‌గా ప్రేమిస్తున్నారో మేం కూడా అంతే ప్రేమిస్తున్నాం` అని వర్మ పేర్కొన్నారు.