సినిమా వార్తలు

‘వెన్నుపోటు’ సర్వేఫలితాలు విడుదల చేసిన వర్మ


10 months ago ‘వెన్నుపోటు’ సర్వేఫలితాలు విడుదల చేసిన వర్మ

ప్రముఖ దర్శకుడు క్రిష్ మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై ‘కథా నాయకుడు’, ‘మహా నాయకుడు’ పేరుతో సినిమాలను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. మరోవైపు ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతి రాక, ఆ తర్వాత రాజకీయ పరిణామాలపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పేరుతో మరో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ విడుదల చేసిన వెన్నుపోటు పాటతో ఏపీలో రాజకీయ వేడి మరింతగా పెరిగింది. తాజాగా ఈ వ్యవహారంపై వర్మ మరోసారి ట్విట్టర్ లో స్పందించారు. వైస్రాయ్ గ్యాంగ్, నాదెండ్ల భాస్కర్ వెన్నుపోట్లలో ఏది పెద్ద వెన్నుపోటో చెప్పాలని ప్రజలను ప్రశ్నించారు. దీంతో పలువురు నెటిజన్లు వర్మ సర్వేపై స్పందించారు. తాజాగా ఆ ఫలితాలను వర్మ విడుదల చేశారు. వైస్రాయ్ గ్యాంగ్ వెన్నుపోటు పెద్ద వెన్నుపోటని 69 శాతం మంది తెలిపినట్లు వర్మ పేర్కొన్నారు. మరో 31 మంది నాదెండ్ల భాస్కరరావు చేసిందే పెద్ద వెన్నుపోటని చెప్పిన్నట్లు వెల్లడించారు. ఈ సర్వే ఫలితాలను వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.