సినిమా వార్తలు

మరో సంచలనానికి వర్మ సిద్దం


11 months ago మరో సంచలనానికి వర్మ సిద్దం

అచ్చం సీఎం చంద్రబాబునుయుడిని పోలిన ఓ వ్యక్తి వీడియో కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వ్యక్తి ఆచూకీ తెలుసుకోవాలని ప్రయత్నించిన రామ్ గోపాల్ వర్మ ఎట్టకేలకు విజయం సాధించాడు. ఒక తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్  ద్వారా చంద్రబాబు లాంటి వ్యక్తి ఆచూకీని వర్మ గుర్తించాడు. కానీ అతడి వివరాల్ని మాత్రం బయటపడనీయలేదు. అయితే సోషల్ మీడియాలో ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు కొన్ని బయటకొచ్చాయి. వీడియోలో అతను హోటల్ కు వచ్చిన వారికి భోజనం వడ్డిస్తున్నాడు. ఆ హోటల్ కూడా అతనిదేనని తెలుస్తోంది. అది త్రయంబకేశ్వర్ లో ఉందని సమాచారం. అతడ్ని కొంతమంది ప్రభు అని, మరికొంతమంది భూషణ్ అని పిలుస్తుంటారట. అయితే చంద్రబాబును పోలిన ఆ వ్యక్తి ఇప్పుడు త్రయంబకేశ్వర్ లో లేడట. అక్కడి నుంచి ముంబయికి వెళ్లిపోయాడట. భూషణ్ ముంబయికి వెళ్లినప్పటికీ అతడి అడ్రెస్ మాత్రం రామ్ గోపాల్ వర్మ వద్ద ఉందట. కావాలనే ఈ విషయాల్ని వర్మ వెల్లడించలేదని సమాచారం. అతడ్ని కలిసి, అతడితో ఫొటో దిగి అప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాలనేది వర్మ ప్లానని తెలుస్తోంది. ప్రస్తుతం వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ బయోపిక్ తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో చంద్రబాబు పాత్ర కోసం ఈ భూషణ్  కోసం ఆరా తీశాడు. త్వరలోనే వర్మ అతనిని తెరపైకి తీసుకురానున్నాడన్నమాట.