సినిమా వార్తలు

‘వెన్నుపోటు’ను హైలెట్ చేస్తున్న వర్మ


9 months ago ‘వెన్నుపోటు’ను హైలెట్ చేస్తున్న వర్మ

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన దగ్గర నుంచి నడిచిన కథను 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని వివరంగా చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ జీవితాన్ని కథానాయకుడు, మహానాయకుడు పేరుతో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ‘వెన్నుపోటు’ పాట ఫస్ట్ లుక్ ను ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తానని ప్రకటించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న కథానాయకుడు ట్రైలర్ కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ విషయంపై రామ్ గోపాల్ వర్మ ట్వీట్ పై నెటిజన్లు విపరీతమైన జోకులు వేస్తున్నారు.