సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల తరువాత మూవీ ఇదే!


11 months ago శేఖర్ కమ్ముల తరువాత మూవీ ఇదే!

‘ఫిదా’ తరువాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఏ సినిమా రూపొందిస్తున్నారా? అని అందరూ ఎదు చూస్తున్నారు. వారికి ఇప్పుడుఒక తీపి కబురు అందింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని కథలను సిద్ధం చేసుకోవడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడనే విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ కు అందమైన ప్రేమకథను ముడిపెడుతూ తెరపై ఆయన అద్భుతంగా ఆవిష్కరిస్తారనే పేరొదారు. అందుకు ఉదాహరణగా 'ఫిదా' సినిమాను గురించి చెప్పవచ్చు. ఆ సినిమా ఘన విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ వెంటనే సెట్స్ పైకి వెళ్లకుండా మరింత జాగ్రత్త తీసుకుని ఆయన మరో కథను రెడీ చేసుకున్నారని సమాచారం. ఈ కథకి కథానాయకుడు కొత్త కుర్రాడు అయితే బాగుంటుందని భావించిన ఆయన, ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటున్నారట. హీరోను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయిందనీ .. త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటించనున్నారని తెలుస్తోంది. ఇక కథానాయిక విషయంలో కూడా ఇంకా క్లారిటీ రావలసి వుంది. ఏషియన్ సునీల్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తారని సమాచారం.