సినిమా వార్తలు

వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’


1 year ago వసూళ్లతో దూసుకుపోతున్న ‘యూటర్న్‌’

‘యూటర్న్‌’ సినిమా తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి టాక్‌ అందుకుంది. వినాయక చవితి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.12 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఈ సినిమా కేవలం తమిళనాడులో (నాలుగు రోజుల్లో) రూ.3.6 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో రూ.5.95 కోట్లు సాధించినట్లు సమాచారం. అమెరికాలో రూ.1.58 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ.16.50 కోట్లు, ఇతర దేశాల్లో రూ.25 లక్షలు రాబట్టినట్లు విశ్లేషకులు చెప్పారు. అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యూటర్న్‌’. ఆది పినిశెట్టి, భూమిక, రాహుల్‌ రవీంద్రన్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. పవన్‌ కుమార్‌ దర్శకుడు. కన్నడ హిట్‌ ‘యూటర్న్‌’కు తెలుగు, తమిళ రీమేక్‌ ఇది. శ్రీనివాస్‌ చిట్టూరి, రాంబాబు బండారు నిర్మాతలు. సంగీతం.. పూర్ణచంద్ర. ‘రంగస్థలం’, ‘మహానటి’ తర్వాత సమంత ఈ ఏడాది ‘యూటర్న్‌’తో మరో హిట్‌ అందుకున్నారు. దీంతో శామ్ హ్యాట్రిక్ సాధించినట్లయ్యింది.