సినిమా వార్తలు

23 కోట్లు వసూలు చేసిన 'యూటర్న్'


1 year ago 23 కోట్లు వసూలు చేసిన 'యూటర్న్'

సమంత ప్రధాన పాత్రను పోషించిన 'యూటర్న్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడలో ఘన విజయాన్ని సొంతం చేసుకొన్న సినిమాకి ఇది రీమేక్. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి .. రాహుల్ రవీంద్రన్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకూ ఈ థ్రిల్లర్ మూవీ 23 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మించిన ఈ సినిమా ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టడం విశేషంగా చెబుతున్నారు. ఇంట్రెస్టింగ్ కంటెంట్ కారణంగానే ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది సమంత నటించిన అన్ని సినిమాలు వరుస విజయాలను సాధించాయి.  'యూటర్న్' చిత్రం విడుదలై, మంచి టాక్ ను తెచ్చుకున్న నేపథ్యంలో, విహారయాత్రకు వెళ్లిన ఆమె, అక్కడ తీయించుకున్న ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది, అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'మానసిక ప్రశాంతత' అంటూ ఫొటోకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటో పోస్టు చేసిన తరువాత నాలుగు గంటల వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.