సినిమా వార్తలు

త్రివిక్రమ్ తదుపరి మూవీ అల్లు అర్జున్ తో..


11 months ago త్రివిక్రమ్ తదుపరి మూవీ అల్లు అర్జున్ తో..

త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం .. భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా తన హవా కొనసాగిస్తోంది. మొత్తానికి త్రివిక్రమ్ తొలిసారే ఎన్టీఆర్ కి మంచి హిట్ ఇచ్చాడని అంటున్నారు. త్రివిక్రమ్ తదుపరి సినిమా ఏ హీరోతో ఉండనుందనే విషయంపై చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ తదుపరి సినిమా రాజమౌళితో వుంది. ఇక చరణ్ .. బోయపాటి సినిమాతో బిజీగా వున్నాడు. రెండు ప్రాజెక్టులతో బిజీగా వున్న ప్రభాస్ .. ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కూడా లేదు. ఇక మహేశ్ కూడా తన 25వ సినిమా పనుల్లో తీరికలేకుండా వున్నాడు. ఇలా ఈ హీరోలంతా ఎవరి ప్రాజెక్టులను వాళ్లు చేసుకుపోతుండటంతో, అల్లు అర్జున్ పైనే త్రివిక్రమ్ దృష్టి ఉందనే టాక్ వుంది. ఇక అల్లు అర్జున్ కూడా 'అరవింద సమేత' రిజల్ట్ చూశాక త్రివిక్రమ్ తో ముందుకు వెళ్లాలా? వద్దా? అనేది ఆలోచిద్దామని అనుకున్నాడు. ఆ సినిమా హిట్ కొట్టేసింది కనుక, ఇక ఈ కాంబినేషన్ సెట్ అయినట్టేనని సినీ జనాలు అంటున్నారు.