సినిమా వార్తలు

త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చిన చిరు


9 months ago త్రివిక్రమ్ కి ఛాన్స్ ఇచ్చిన చిరు

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకులంతా మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాలని తహతహలాడుతుంటారు. అయితే ఆ అదృష్టం కొందరికే దక్కుతుంది. ఇప్పుడు ఆ జాబితాలో త్రివిక్రమ్ చేరాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయానా చిరంజీవే వెల్లడించారు. “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన చేశారు. ‘అతి త్వరలో నేను త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాను అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది.

“ఆర్.ఆర్.ఆర్” “వినయ విధేయ రామ” తదితర భారీ బడ్జెట్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న డి.వి.వి దానయ్య ఈ సినిమాని నిర్మించనున్నారు. కేవలం రామ్ చరణ్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది” అని చిరంజీవి చెప్పారు. ప్రస్తుతం సైరా సినిమాతో బిజీగా ఉన్నారు. తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక  త్రివిక్రమ్ తో చిరంజీవి సినిమా చేయనున్నారు.