సినిమా వార్తలు

బ‌న్నీ సినిమాకు త్రివిక్ర‌మ్ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు


9 months ago బ‌న్నీ సినిమాకు త్రివిక్ర‌మ్ మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు

ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్ తో ఉంద‌నే సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ ఓకే అనిపించుకున్న త్రివిక్రమ్, మిగతా పనులతో బిజీగా వున్నాడ‌ని తెలుస్తోంది. ఈ సినిమా విషయంలో ఆయన మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ 'అరవింద సమేత' సినిమా చేశాడు. ఈ సినిమా చూసినవాళ్లలో కొందరు .. ఇది త్రివిక్రమ్ సినిమా మాదిరిగా లేదనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆయన సినిమాల్లో సహజంగా వుండే పంచ్ డైలాగ్స్ లేకపోవడం, కామెడీకి ప్రాధాన్యత లేకపోవడం వలన 'అరవింద సమేత' సినిమా విషయంలో  విమర్శలు ఎదురయ్యాయి. అందుకనే బన్నీ సినిమాకి సంబంధించిన కథ విషయంలో ఆయన వినోదం పాళ్లు ఎంతమాత్రం తగ్గకుండా చూసుకున్నార‌ని స‌మాచారం. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగేలా స్క్రీన్ ప్లే ను సెట్ చేశాడని అంటున్నారు. మొత్తానికి బన్నీతో హ్యాట్రిక్ హిట్ సాధించాల‌ని త్రివిక్ర‌మ్ తాప‌త్ర‌య ప‌డుతున్నాడ‌ట‌.