సినిమా వార్తలు

త్రివిక్ర‌మ్ రాయలసీమను రెచ్చ‌గొట్టారు


9 months ago త్రివిక్ర‌మ్ రాయలసీమను రెచ్చ‌గొట్టారు

‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ రాయలసీమపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో సీమపై పలు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటున్నారు వాటిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రాయలసీమ పోరాట సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు త‌మ అభిప్రాయాలు తెలిపారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించి పలు అభ్యంతరకరమైన సీన్లు, మాటలు ఉన్నాయని నేతలు అంటున్నారు. ఇలాంటి సినిమాను రూపొందించినందుకు త్రివిక్రమ్ సీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని రాయ‌ల‌సీమ నేతలు హెచ్చరిస్తున్నారు.