సినిమా వార్తలు

త్రివిక్రమ్, వెంకీ మూవీ ఇప్పట్లో లేనట్టే!


11 months ago త్రివిక్రమ్, వెంకీ మూవీ ఇప్పట్లో లేనట్టే!

వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని కొంతకాలంగా వార్తలు వినిపించాయి. ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ వార్తవన్న వెంకటేశ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. గతంలో వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' సినిమాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. దీంతో అవి ఘన విజయాన్ని సాధించాయి.

అందుకే మరోసారి వెంకీ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని తెలియగానే వారి అభిమానులు సంబరపడిపోయారు. అయితే వారికి నిరాశను కలిగించే వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. కాగా త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను అల్లు అర్జున్ తో చేయనున్నాడనీ, ఆ తరువాత సినిమాను మహేశ్ బాబుతో చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు చరణ్, అఖిల్ కూడా తమ తదుపరి ప్రాజెక్టుల కోసం త్రివిక్రమ్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. దీంతో వెంకటేశ్ తో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది.