సినిమా వార్తలు

అభిమానులకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ధన్యవాదాలు


11 months ago అభిమానులకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ధన్యవాదాలు


నిన్ననే విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం హీరో జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో తనకు అండగా నిలిచిన, కొండంత బలాన్ని ఇచ్చిన అభిమానులకు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా, చిత్రయూనిట్ కు, మీడియాకు కూడా తన థ్యాంక్స్ చెప్పారు. ఈ సినిమాపై అభిమానులు, ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణను మర్చిపోలేనని, దృఢ సంకల్పంతో పని చేసిన త్రివిక్రమ్ లేకపోతే ఈ విజయం సాధ్యమయ్యేది కాదని అన్నారు.  అలాగే ఈ చిత్రంపై మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ పరిచయం లేనివాళ్లు సైతం తనకు ఫోన్ చేసి అభినందిస్తున్నారని, తనకు గౌరవం ఇచ్చిన సినిమా ఇదని చెప్పారు. ఈ చిత్ర కథను తమ కంటే ఎన్టీఆర్ ఎక్కువగా నమ్మారని చెప్పారు. ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్, ఎన్టీఆర్ కు స్టెప్పులు తగ్గుతున్నాయేమోనని తాము ఆలోచించే వాళ్లమని, ఎన్టీఆర్ మాత్రం తనకు ఏ కథ అయితే చెప్పానో దాన్ని అలాగే తీయమని చెప్పి తమను ముందుకు నడిపించారని వివరించారు. ఇందుకు ‘ఫస్ట్ థ్యాంక్స్‘ ఎన్టీఆర్ కే చెప్పాలని పేర్కొన్నారు.