సినిమా వార్తలు

ప్రభాస్ చిత్రానికి ట్రెండీ టైటిల్


8 months ago ప్రభాస్ చిత్రానికి ట్రెండీ టైటిల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తూనే రాధాకృష్ణ దర్శత్వంలో మరో చిత్రాన్ని ప్రారంభించారు. గత ఏడాదే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. రాధాకృష ఈ చిత్రాన్ని 1960నాటి పరిస్థితుల నేపథ్యంలో ఎమోషనల్ ప్రేమ కథగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రభాస్ వింటేజ్ కార్ల వ్యాపారిగా ఈ చిత్రంలో కనిపిస్తాడని అంటున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ దాదాపుగా ఖరారు అయినట్లు భోగట్లా. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్న కమల్ కణ్ణన్ ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ చిత్రం గురించి చూచాయిగా చెప్పారు. ఆయన మాటలని బట్టి ప్రభాస్, రాధాకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న చిత్ర టైటిల్ 'జాన్' అని తెలుస్తోంది. ఇటీవల జాన్ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ముందుగా క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అని కమల్ కణ్ణన్ తెలిపారు. కమల్ కణ్ణన్ అనుకోకుండా జాన్ అని ప్రస్తావించడంతో ప్రభాస్ 20 వ చిత్రం టైటిల్ ఇదేననే విషయం బయట పడింది. టైటిల్ సింపుల్ గా, ట్రెండీగా ఉందని అభిమానులు అంటున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సాహో ఆగష్టు 15న విడుదల కానుంది.