సినిమా వార్తలు

ఈరోజు రూ. 500 కోట్ల సినీ వ్యాపారం


9 months ago ఈరోజు రూ. 500 కోట్ల సినీ వ్యాపారం

ఈరోజు (డిసెంబ‌రు 21) రూ. 500 కోట్లకు పైగా సినీ వ్యాపారానికి తెర‌లేచింది. ఈరోజు ఐదు భారీ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. తెలుగులో ‘పడిపడి లేచె మనసు, ‘అంతరిక్షం’, తమిళనాట ‘మారి 2’.. కన్నడలో ‘కేజియఫ్’.. హిందీలో ‘జీరో’ సినిమాలు ఒకేరోజు విడుదలవుతున్నాయి. దీంతో అంద‌రి దృష్టి ఈ రోజుపైనే పడింది. ఈ ఒక్క‌రోజే ఐదు భారీ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి ఒక్కో ఇండ‌స్ట్రీలో ఒక్కో సినిమా రాబోతుంది. తెలుగులో అయితే ఈరోజు రెండు క్రేజీ సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. శర్వానంద్ న‌టించిన "పడిపడి లేచె మనసు".. వరుణ్ తేజ్ "అంతరిక్షం" సినిమాలు విడుద‌ల అవుతున్నాయి. ఈ రెండు సినిమాల‌పై మంచి అంచ‌నాలున్నాయి. ముఖ్యంగా "అంత‌రిక్షం" అయితే తెలుగులో వ‌స్తున్న తొలి స్పేస్ థ్రిల్ల‌ర్. దానికి తోడు క్రిష్ ఈ చిత్రాన్ని దాదాపు రూ. 25 కోట్ల‌తో నిర్మిస్తున్నాడు. ఈ సినిమా బిజినెస్ కూడా 21 కోట్ల వరకు జరిగింది. ఇక శ‌ర్వానంద్ వ‌ర‌స విజ‌యాల్లో ఉండ‌టం "ప‌డిప‌డి లేచె మ‌న‌సు"కు ప్ల‌స్. దానికితోడు సాయిప‌ల్ల‌వి హ‌వా ఉండ‌నే ఉంది. ఈ సినిమా బిజినెస్ కూడా 30 కోట్ల వరకు జరుగుతుందంటున్నారు. క‌న్న‌డ సినిమా "కేజిఎఫ్‌ కూడా ఈరోజే విడుద‌ల కానుంది. య‌శ్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా చాలా భారీగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌కు రాజ‌మౌళి రావడం.. ట్రైలర్స్ కూడా ఆకట్టుకోవడంతో బాగానే ఆసక్తి నెల‌కొంది. ఈ సినిమా కన్నడలో 54 కోట్లకు పైగానే బిజినెస్ చేసింది. అలాగే తెలుగులోకి డబ్ అవుతున్న సినిమా మారి 2. సాయిప‌ల్ల‌వి ఉండ‌టంతో ఈ సినిమాపై తెలుగులో కూడా మంచి ఆస‌క్తే ఉంది. 

ఇక షారుక్ ఖాన్ "జీరో" సినిమా కూడా డిసెంబ‌ర్ 21నే రానుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర‌స ఫ్లాపుల‌తో వెన‌క‌బ‌డిపోయిన కింగ్ ఖాన్‌కు "జీరో" ఫ‌లితం కీల‌కంగా మారింది. దీంతో జీరోతో హిట్ కొట్టి ఫామ్‌లోకి రావాలని కింగ్ ఖాన్ బావిస్తున్నాడు.