సినిమా వార్తలు

ఎన్టీఆర్ సినిమా క‌థ ఇదే!


9 months ago ఎన్టీఆర్ సినిమా క‌థ ఇదే!

ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రకటించిన దగ్గర నుండి ఏదొక అప్ డేట్  వస్తూనే ఉంది. మొదటి నుండి ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది అందరిలో ఓ చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అవ్వడంతో మొదటి భాగం ఎండ్ అవుతుందని తెలుస్తోంది. కానీ తాజా సమాచారం అది వాస్తవం కాదని స‌మాచారం. మొదటి పార్ట్ కీలకంగా డ్రామానే వుంటుదని, ఇప్పుడు యూనిట్ హడావుడి చేస్తున్న సినిమా నటులు, పాటలు, సీన్లు అన్నీ కలిపి గట్టిగా అరగంట మాత్రమే వుంటాయని స‌మాచారం.

ఎన్టీఆర్ చిన్నప్పుడు నుండి పెళ్లి చేసుకున్నా కొన్నాళ్ల వరకు హరి కృష్ణ..చంద్రబాబు తో ఉండే అనుబంధం గురించి ఈ మొదటి పార్ట్ లో చూపించనున్నారిన బోగ‌ట్టా. ఇక రెండో భాగంలో రాజకీయం, దివిసీమ ఉప్పెన వంటి వ్యవహారాలు వుంటాయంటున్నారు..ఇందులోనే ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎలా ప్ర‌వేశించార‌నే దానిని చూపిస్తారట. బాలకృష్ణ పాత్రలో బాలయ్య కనిపించనున్నాడు. కానీ బాలయ్య సీన్స్ చాలా తక్కువని సమాచారం. సెకండ్ పార్ట్ లో రానా..కళ్యాణ్ రామ్ లా పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఫస్ట్ పార్ట్ మొత్తం ఎమోషన్లు, డ్రామాతో ఉంటుందని..సెకండ్ పార్ట్ లో దివిసీమ ఉప్పెన పార్ట్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.