సినిమా వార్తలు

సంక్రాంతికి బన్నీ ప్లాన్ ఇదే!


7 months ago సంక్రాంతికి బన్నీ ప్లాన్ ఇదే!

సంక్రాంతి పండుగ వస్తున్నదనగానే ముందుగా గుర్తొచ్చేది ఆంధ్రా. ముఖ్యంగా కోడిపందేలతో ఆంధ్రా అంతా సందడితో నిండిపోతుంది. ఇటీవల విజయ్ దేవరకొండ కూడా తనకు కోడిపందేలు చూడాలని ఉందని తెలిపారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా సంక్రాంతికి సొంతూరు అయిన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు పయనమవుతున్నారనే వార్త వినిపిస్తోంది. బిజీ లైఫ్‌లో సినీ స్టార్స్ సొంతూళ్లకు వెళ్లటం చాలా అరుదు. బన్నీ కూడా తన సొంతూరును ఈ మధ్యకాలంలో సందర్శించినదే లేదు. కాబట్టి తన పిల్లలకు సొంతూరును పరిచయం చేయాలని బన్నీ భావిస్తున్నట్టు చెబుతున్నారు. నూతన సంవత్సర సందర్భంగా బన్నీ తన 19వ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందనుంది.