సినిమా వార్తలు

మ‌నోజ్ ఆస‌క్తిక‌ర ట్వీట్ ఇదే


9 months ago మ‌నోజ్ ఆస‌క్తిక‌ర ట్వీట్ ఇదే

ఈ మధ్య హీరో మంచు మనోజ్ స‌మాజ‌సేవ‌కు న‌డుం బిగించాడు. ఈ నేపథ్యంలో తన మకాంను కూడా తిరుపతికి మార్చుకున్నాడు. ఇక ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గానే ఉంటాడు. అభిమానులకు ట్విట్టర్ ద్వారా టచ్‌లో ఉంటూ.. వారు అడిగే ప్రశ్నలకు ఓపికగా స‌మాధానం చెబుతుంటాడు. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ చూసిన మనోజ్.. ఇది చాలంటూ ఆనందపడిపోయాడు. ‘ఇది ఎలక్షన్ అయిపోయాక అడుగుతావేం మామా. రాజకీయాల్లోకి వచ్చేది ఎందుకు జనానికి మంచి చెయ్యటానికి, మనోజ్ అన్న ఇప్పుడే చేస్తున్నాడు, ఎవరైనా హెల్ప్ అంటే చాలు.. ఆయనలో సాయపడేతత్వాన్ని చాలా సార్లు గమనించా’’ అని పేర్కొన్నాడు. దీనిని చూసిన మనోజ్ ‘ఇది చాలురా సామి.. తృప్తిగా పడుకుంటా... థాంక్స్ తమ్ముడు’’ అని స‌మాధానం ఇచ్చాడు.