సినిమా వార్తలు

విశ్వదర్శనంలో కళాతపస్వి జీవితం!


7 months ago విశ్వదర్శనంలో కళాతపస్వి జీవితం!

కళాతపస్వి కె విశ్వనాథ్ జీవితం ఆధారంగా రూపొందిస్తున్న‌ చిత్రం ‘విశ్వదర్శనం’. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల. రచయిత జనార్ధనమహర్షి దర్శకుడు. ఫిబ్రవరి 19న విశ్వనాథ్ జన్మదినం. ఈ సందర్బంగా ‘విశ్వదర్శనం’ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ నా గురించి అందరికీ తెలియ‌జేయాల‌ని కోరుకోను. కానీ కొన్నిసార్లు మనవారికోసం కొన్ని ఖచ్చితంగా చేయాలి. అటువంటి ప్రయత్నమే ‘విశ్వదర్శనం’ అన్నారు. ఈ ఆలోచనలకు నీరుపెట్టింది, నారుపోసింది జనార్ధన మహర్షి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాన‌ని విశ్వ‌నాథ్ అన్నారు. దర్శకుడు జనార్ధన మహర్షి మాట్లాడుతూ ‘చిన్నప్పటినుండి విశ్వ‌నాథ్‌ తీసిన సినిమాల్లోని కథలను అమ్మ చెప్తుంటే వింటూ పెరిగాను. నాకు గురువు, దైవమైన తనికెళ్ల భరణి దగ్గర మూడేళ్లు అసిస్టెంట్‌గా పనిచేసి తర్వాత 100 సినిమాలకు మాటల రచయితగా పనిచేశాన‌న్నారు. 2011లో నా సొంత బ్యానర్‌పై ‘దేవస్థానం’తో ఆయన్ని దర్శకత్వం చేసే భాగ్యం దక్కింద‌న్నారు. తిరిగి ఇప్పుడు ఆయనతో పనిచేసే అవకాశం ‘విశ్వదర్శనం’ ద్వారా క‌లిగింద‌న్నారు. చిత్రంలో ఆయన బయోగ్రఫీ చూపించటం లేద‌ని, ఓ మహాదర్శకుని సినిమాలు సొసైటీపై ఎటువంటి ప్రభావం చూపించాయనేది తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు.