సినిమా వార్తలు

ఆకట్టుకుంటున్న నాని జెర్సీ టీజర్


8 months ago ఆకట్టుకుంటున్న నాని జెర్సీ టీజర్

నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'జెర్సీ'సినిమా రూపొందుతోంది.నాని క్రికెటర్ గా ఈ సినిమాలో కనిపించనున్నాడు, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను పూర్తయ్యింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. క్రికెటర్ గా తాను అనుకున్న స్థానానికి చేరుకోవడానికి నాని పడిన కష్టం, నిరుత్సాహ పరిచే మాటలను అధిగమించిన తీరు, తాను అనుకున్న స్థాయికి చేరుకుని పొందిన ఆనందం ఈ టీజర్లో చూపించారు. 'ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు గానీ, ప్రయత్నిస్తే ఓడిపోయినవాడు లేడు' అనే డైలాగ్ చాలా బాగుంది. కథ అంతా కూడా క్రికెట్ నేపథ్యంలోనే కొనసాగుతుందనే విషయం ఈ టీజర్ వలన తెలుస్తోంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఏప్రిల్లో రానుంది.