సినిమా వార్తలు

కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్


7 months ago కైరాను దెబ్బతీసిన భారీ డిజాస్టర్

తొలి సినిమాతోనే కైరా అడ్వానీ.. మ‌హేష్ బాబుతో క‌ల‌సి న‌టించే మంచి ఛాన్స్ కొట్టేసింది. భ‌ర‌త్ అనే నేను షూటింగ్ జరుగుతుండగానే రామ్ చ‌ర‌ణ్ విన‌య విధేయ రామాలోనూ కైరానీ క‌థానాయిక‌గా ఎంపికచేశారు. దీంతో కైరా టాప్ హీరోయిన్ స్థాయి దక్కించుకుంది. దీంతో ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కైరాని హీరోయిన్ గా ఎంపికచేసే అవ‌కాశాలున్నాయ‌న్న టాక్ వినిపించింది. దాంతో.. కైరా ద‌శ తిరిగిపోయింద‌ని అంతా భావించారు. అయితే `విన‌య విధేయ రామ‌` డిజాస్ట‌ర్ కైరా కెరీర్‌పై ప్రభావం చూపిస్తోంది. `భ‌ర‌త్ అనే నేను` సూప‌ర్ హిట్‌ కైరాకు ఎంతవరకూ ప్లస్ అయ్యిందో గానీ, ‘విన‌య విధేయ రామ‌’ ఫ్లాప్ తో మాత్రం ఆమె కెరీర్ చిక్కుల్లో ప‌డినట్లయ్యింది. దీంతో పెద్ద హీరోలు, బ్యాన‌ర్లు కైరాను పక్కనపెట్టడం మొదలుపెట్టారట. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ నుంచి కూడా కైరా సైడ్ అయిపోయిన‌ట్లు భోగట్టా. మరి స్టార్ హీరోలు ప‌క్క‌న పెడితే మీడియం స్థాయి క‌థానాయ‌కుల‌తో స‌ర్దుకుపోవాలి. మ‌రి కైరా అందుకు సిద్ధమవుతుందో లేదో? ఇదిలావుంటే బాలీవుడ్‌లో కైరాకి పలు ఆఫ‌ర్లు అందుతున్నాయి. అక్క‌డ ప్ర‌స్తుతం రెండు సినిమాలు చేస్తోంది. టాలీవుడ్ జ‌ర్నీకి ప్ర‌స్తుతానికి కామా పెట్టి, బాలీవుడ్ పైనే దృష్టి పెట్టాల‌ని కైరా భావిస్తున్న‌ట్టు సమాచారం.