సినిమా వార్తలు

విజయమ్మ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల


8 months ago విజయమ్మ పాత్ర ఫస్ట్ లుక్ విడుదల

కాంగ్రెస్ నేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్రగా 'యాత్ర' సినిమా రూపొందిస్తున్నారు. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మమ్ముట్టి నటించారు. రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి లుక్ కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ తో పాటు ట్రైలర్ కి కూడా అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ పాత్రలో 'ఆశ్రిత వేముగంటి' నటించారు. ఆమెకి సంబంధించిన ఫస్టులుక్ ను తాజాగా విడుదల చేశారు. ఆశ్రిత వేముగంటి లుక్ వైఎస్ విజయమ్మకు చాలా దగ్గరగా అనిపిస్తోంది. ఈ పాత్ర విషయంలో ఎంత శ్రద్ధ తీసుకున్నారనేది ఆమె లుక్ చూస్తేనే అర్థమవుతోంది. ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఈ సినిమా వీక్షించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.