సినిమా వార్తలు

అలరిస్తున్న మోహన్‌లాల్ ‘ఒడియన్' టీజర్


9 months ago అలరిస్తున్న మోహన్‌లాల్ ‘ఒడియన్' టీజర్

మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా 'ఒడియన్' చిత్రం రూపొందింది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఉన్నత సాంకేతిక విలువలతో నిర్మితమైంది. సూపర్ పవర్స్ కలిగిన విభిన్నమైన పాత్రలో ఈ చిత్రంలో మోహన్ లాల్ కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్స్ తో అరించనున్నారు. మలయాళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదల చేసి పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు.  ఇంతవరకూ మోహన్ లాల్ ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. ఆ చిత్రాల సరసన ఈ సినిమా నిలుస్తుందని అభిమానులు అనుకుంటున్నారు. సంచలన విజయాన్ని సాధించడం ఖాయమనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.