సినిమా వార్తలు

ఆ బయోపిక్‌లకు సెన్సార్ చిక్కులు


8 months ago ఆ బయోపిక్‌లకు సెన్సార్ చిక్కులు

ఎన్టీఆర్ బయోపిక్‌తో పాటు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు తాజాగా సెన్సార్ బోర్డు పెట్టిన మెలిక ఇబ్బందికరంగా మారింది. జీవిత చరిత్ర నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతుండటంతో, పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉన్నపక్షంలో వారి వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలని సెన్సార్ బోర్డు చెబుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ ను కథానాయకుడు, మహానాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. కథానాయకుడు చిత్రం ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించింది కావడంతో... దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.

మహానాయకుడు చిత్రం రాజకీయ నేపథ్యంలో కొనసాగనుండటంతో ఎన్ఓసీ తీసుకురావడానికి కొంత ఇబ్బంది ఎదురుకావచ్చంటున్నారు. మరోవైపు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డు కండిషన్ పెద్ద సమస్యగా మారనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్ వివాదాస్పదంగా నిలిచింది. ఈ చిత్రంలో ఉన్న పాత్రలకు సంబంధించిన వ్యక్తుల నుంచి చిత్ర యూనిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా తీసుకువస్తుందని హాట్ టాపిగా మారింది.