సినిమా వార్తలు

చైతూ కోసం 'బాహుబలి' రచయిత కసరత్తు


9 months ago చైతూ కోసం 'బాహుబలి' రచయిత కసరత్తు

ఇటీవలి కాలంలో నాగచైతన్య చేస్తున్న సినిమాలు ఆయనతో పాటు ఆయన అభిమానులకు నిరాశను కలిగిస్తున్నాయి. అయితే ఈమధ్య వచ్చిన 'శైలజా రెడ్డి అల్లుడు' చైతూ కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని నాగార్జున అనుకున్నారు. కానీ ఆ సినిమా కూడా పరాజయాన్నే అందించింది. దాంతో చైతూ కెరియర్ పై నాగార్జున ప్రత్యేక దృష్టి పెట్టారని. చైతూ బాడీ లాంగ్వేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒక మంచి కథను సిద్ధం చేయమని ఆయన ‘బాహుబలి’రచయిత విజయేంద్ర ప్రసాద్ ను కోరారని సమాచారం. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్- నాగార్జునల మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. అద్భుతమైన కథలతో అసాధారణమైన విజయాలను అందించిన ఘనత విజయేంద్ర ప్రసాద్ కి వుంది. నాగార్జున కోరిక మేరకు యాక్షన్ .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఆయన ఒక కథను సిద్ధం చేస్తున్నారని సమాచారం. కథ పూర్తయ్యాక దానిని ఏ దర్శకుడి చేతిలో పెట్టాలనేది నాగార్జున నిర్ణయిస్తారట. ప్రస్తుతం నాగచైతన్య, సమంతో కలిసి 'మజిలి' సినిమా చేస్తోన్న విషయం విదిమే.