సినిమా వార్తలు

అందుకే 'నోటా చేశాను:: విజయ్ దేవరకొండ


11 months ago అందుకే 'నోటా చేశాను:: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 'నోటా' చిత్రం రూపొందింది. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఇది ద్విభాషా చిత్రంగా నిర్మితమైంది. సమకాలీన రాజకీయాలను సహజంగా ఆవిష్కరించే సినిమా ఇది. "తమిళ రాజకీయాలకి దగ్గరగా .. చాలా ఆసక్తికరంగా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా నాకు రాజకీయాల పట్ల ఆసక్తి వుంది. అందుకే ఈ పొలిటికల్ స్టోరీని ఎంచుకున్నాను. కాస్త ఆలస్యమైనా ప్రేమకథా చిత్రాలను చేసుకోవచ్చు. కానీ ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి .. అందువల్లనే వచ్చిన అవకాశాన్ని వదులుకోలేదు. మీరు ఈ సినిమా చూసిన తరువాత కొత్తదనం కోసం నేను ఎంతగా ట్రై చేశాననేది అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చాడు.  కాగా విజ‌య్ వారసత్వ హీరోలను గురించి తనదైన శైలిలో స్పందించాడు. "సినిమా అనేది కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యాపారం. డబ్బులు పెట్టే నిర్మాతలు .. ఆ డబ్బు ఎంతవరకూ వెనక్కి వస్తుందనే విషయంలో భరోసా చూసుకుంటారు. వారసత్వ హీరోలకి ఆల్రెడీ ఫ్యాన్స్ వుండటమనేది వాళ్లకి కలిసొచ్చే అంశం. అందువలన నిర్మాతలు అది సేఫ్ జోన్ గా భావిస్తారు. కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్క్ అనుకుంటారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండగా వచ్చి ఇక్కడ నిలదొక్కుకోవడం చాలాకష్టం. ఏడాదికి నాలాంటి వాళ్లు ఒకరిద్దరు ఇక్కడ కుదురుకుంటారేమో అని చెప్పాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.