సినిమా వార్తలు

21న 'దటీజ్ మహాలక్ష్మి' టీజర్


9 months ago 21న 'దటీజ్ మహాలక్ష్మి' టీజర్

హిందీలో కంగనా రనౌత్ న‌టించిన‌ 'క్వీన్స సినిమా భారీ విజయాన్ని న‌మోదుచేసింది. విమర్శకుల నుంచి సైతం ఈ సినిమా ప్రశంసలను అందుకుంది. నటన పరంగా ఈ సినిమా కంగనాను మరోస్థాయికి చేర్చింది. అలాంటి ఈ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్ కి ప్రశాంత్ వర్మ దర్శకుడు. తెలుగులో తమన్నా ప్రధాన పాత్రగా రూపొందిన ఈ సినిమాకి 'దటీజ్ మహాలక్ష్మి'అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవలే షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా టీజర్ ను విడుద‌ల చేయ‌నున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని స‌మ‌కూర్చారు. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేయనున్నది త్వరలోనే చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించ‌నుంది.