సినిమా వార్తలు

వినయ విధేయ రామపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్


6 months ago వినయ విధేయ రామపై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్

మొన్నటి సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ 'కథానాయకుడు' .. చరణ్ 'వినయ విధేయ రామ' ..  వెంకటేశ్ 'ఎఫ్ 2' విడుదలయ్యాయి. ఈ మూడు సినిమాలను గురించి ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విశ్లేషిస్తూ  ఒక వీడియోను విడుదల చేశారు. 'కథానాయకుడు' సెకండాఫ్ విషయంలో సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో, అభిమానులు అసంతృప్తికి లోనయ్యారని తెలిపారు. ఫ్యామిలీ డ్రామాకి కామెడీ కూడా తోడు కావడంతో 'ఎఫ్ 2' సినిమా బాగా ఆడుతోందని వివరించారు. ఇక 'వినయ విధేయ రామ' విషయానికొస్తే, నటుడిగా 'రంగస్థలం' సినిమాకి ముందు చరణ్ వేరు .. ఇప్పుడు చరణ్ వేరు. ఆయన బోయపాటితో చేస్తున్నాడనగానే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. బోయపాటి తన మార్క్ లోనే ఈ సినిమా తీశాడు. అయితే సెకండాఫ్ కేవలం ఫైట్స్ కోసమే తీసినట్టుగా అనిపించడం అభిమానుల అసహనానికి కారణంగా నిలిచింది. సక్సెస్ .. ఫెయిల్యూర్ అనేవి ఎప్పుడూ ఒకచోట వుండవు. ఎవరి ప్రయత్నం వాళ్లు చేశారంతే" అని తమ్మారెడ్డి పేర్కొన్నారు.