సినిమా వార్తలు

దేవరకొండకు ‘టాక్పీవాలా’ పరీక్ష


11 months ago దేవరకొండకు ‘టాక్పీవాలా’ పరీక్ష

నూతన దర్శకుడు రాహుల్ శంకృష్ణన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రాబోతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా థ్రిల్లర్ ‘టాక్సీవాలా’. అయితే, విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కారణంగా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. మొత్తానికి ఈ సినిమా నవంబర్ 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విజయం విజయ్ దేవరకొండ కెరీర్ కి చాలా కీలకంగా మారనుంది.

‘గీత గోవిందం’తో వంద కోట్ల క్లబ్ లోకి చేరిన విజయ్ ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తేనే ఆ స్టార్ ఇమేజ్ నిలిచే అవకాశాలుండేవి. కానీ ఇటీవలే ‘నోటా’ చిత్రం రూపంలో ప్లాప్ ని ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ ‘టాక్సీవాలా’ చిత్రం పై చాలా ఆశలే పెట్టుకున్నాడని సమాచారం.

కాగా ఈ సినిమా ఎప్పుడొచ్చినా విజయవంతం అవుతుందిన విజయ్ ఎప్పటినుంచో చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు. మరి ఈ చిత్రం విజయ్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేస్తుందా.. లేక నోటా లాగే నిరాశ పరుస్తోందా అనేది తెలియాలంటే కొన్నిరోజులు వేచి చూడాల్సిందే