సినిమా వార్తలు

అఖిల్ కు జోడీగా ‘టాక్సీవాలా’ హీరోయిన్


9 months ago అఖిల్ కు జోడీగా ‘టాక్సీవాలా’ హీరోయిన్

యువహీరో అఖిల్ అక్కినేని మిస్టర్ మజ్ను తరువాత  తన నాల్గవ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ తో చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ కు జోడిగా ‘టాక్సీవాలా’ ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ ను ఎంపికచేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి వుంది. కాగా విజయ్ దేవరకొండ కు జోడిగా టాక్సీవాలా లో నటించిన ప్రియాంక తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే ఇటీవల ఆమె మీడియాతో తాను ప్రస్తుతం తెలుగు, తమిళం లో నాలుగు ఆఫర్లు వున్నట్లు వెల్లడించింది. అందులో అఖిల్ సినిమా ఉందో లేదో  తెలియాలంటే మరి కొద్దీ రోజులు వేచిచూడాల్సిందే.