సినిమా వార్తలు

నెల రోజులు రెస్టు తీసుకోనున్న ఎన్టీఆర్


1 year ago నెల రోజులు రెస్టు తీసుకోనున్న ఎన్టీఆర్

ఎన్టీఆర్ హీరోగా చేసిన 'అరవింద సమేత' ఈ నెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎన్టీఆర్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తరువాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఒక నెల రోజుల పాటు రెస్టు తీసుకున్న తరువాతనే ఆయన రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. హరికృష్ణ అకాల మరణం ఎన్టీఆర్ ను బాగా కుంగదీసింది. అయితే దర్శక నిర్మాతలకి ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ వలన .. రిలీజ్ డేట్ ను ముందుగానే ప్రకటించడం వలన దుఃఖాన్ని దిగమింగుకుంటూనే వారం రోజుల లోపే ఎన్టీఆర్ షూటింగులో పాల్గొన్నాడు. అప్పటి నుంచి ఏకధాటిగా షూటింగు కొనసాగడం వలన .. ఆ తరువాత ప్రమోషన్స్ కారణంగా ఎన్టీఆర్ మానసిక వత్తిడికి గురయ్యాడు. అందువలన ఆయన ఈ నెలంతా విశ్రాంతి తీసుకుని, వచ్చేనెలలో రాజమౌళితో కలిసి సెట్స్ పైకి వెళతాడట.