సినిమా వార్తలు

తెలుగు సినిమాలపై తాప్సీ సంచలన కామెంట్స్


11 months ago తెలుగు సినిమాలపై తాప్సీ సంచలన కామెంట్స్

తెలుగు సినిమాలతో వెండితెరకు పరిచయమైన తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ కి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లి రెండు మూడు హిట్స్ కొట్టిందో లేదో తెలుగు సినిమాలపై తాప్సీ నెగటివ్ గా మాట్లాడటం మొదలుపెట్టేంసింది. అసలు తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు దక్కవని, అన్నీ హాట్ రోల్స్ వస్తాయనీ, అది తనకు అస్సలు ఇష్టం ఉండదు అంటూ చెబుతోందిట. అయితే తెలుగులో తాప్సీ చేసినవన్నీ అల్ట్రా మోడ్రన్ పాత్రలే. తమిళ చిత్రాల్లోనూ దాదాపుగా అటువంటి రోల్స్ చేసింది. ఇక బాలీవుడ్‌కు వెళ్లాక తాప్సీ మారిపోయింది. అక్కడ ఆమెకు మంచి పాత్రలే  దొరుకుతున్నాయి. ఇక తెలుగులో తాప్సీ గ్లామరస్ హీరోయిన్‌గా రాణించిందే తప్ప ఏ సినిమాలోనూ నటిగా మంచి మార్కులు వేయించుకోలేకపోయింది. ఆమె నటన అంతంత మాత్రంగా ఉండడంతో గ్లామరస్ పాత్రలకే తాప్సీని పరిమితం చేశారు తెలుగు దర్శకనిర్మాతలు. అయితే ఈ భామ సౌత్ అనగానే తనకు అల్ట్రా గ్లామరస్, బోల్డ్ పాత్రలే గుర్తుకు వస్తాయని చెప్పింది. ఇక బాలీవుడ్‌లో అయితే కొత్త కొత్త ఆలోచనలతో సినిమాలు వస్తాయని అందుకే బాలీవుడ్ లో హిట్స్ తో దూసుకుపోతున్నానని తాప్పీ వివరించింది.