సినిమా వార్తలు

తన పేరుతో మిల్కీ బ్యూటీ వజ్రాల వ్యాపారం


11 months ago తన పేరుతో మిల్కీ బ్యూటీ వజ్రాల వ్యాపారం

సినిమాలలోనే కాదు, బిజినెస్ లోనూ హీరోలకు దీటుగా రాణిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. పదమూడేళ్ల క్రితం హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది మొదలు వరుస సినిమాలతో బిజీగానే ఉంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఇక సినిమా రంగంలో తాను సంపాదించిన సొమ్మును ఇప్పుడు వ్యాపార రంగంలో పెట్టుబడిగా తమన్నా పెడుతోందని సమాచారం. తన పేరుమీద ఏకంగా ఓ వజ్రాల వ్యాపారాన్నే ప్రారంభిస్తోందట.

హీరోయిన్స్‌తో పోలిస్తే హీరోలే ఎక్కువగా వ్యాపార రంగంలో రాణించిన సందర్భాలున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ కూడా బిజినెస్ మేగ్నెట్స్‌గా దూసుకుపోతున్నారు. ఈ కోవలోనే తమన్నా డైమండ్ జ్యూవెలరీ బ్రాండ్‌ను ఆవిష్కరించబోతుందని తెలుస్తోంది. తమన్నా వినాయక చవితి రోజునే తన వ్యాపారాన్ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ వంటి కొంతమంది కథానాయికలు ఫిట్‌నెస్ బిజినెస్‌పై, మరి కొంతమంది ఫ్యాషన్ బిజినెస్‌పై దృష్టిపెడితే.. తమన్నా అందుకు భిన్నంగా వజ్రాల వ్యాపారంపై దృష్టి పెట్టింది. ఇలా డైమండ్ జ్యూయలరీ బిజినెస్ లోకి అడుగుపెట్టిన ఫస్ట్ సౌత్ హీరోయిన్ తమన్నా కాబోతుంది. ఇక బాలీవుడ్‌లో కరీనాకపూర్, కత్రినకైఫ్ వంటి హీరోయిన్స్ వజ్రాల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టినా.. వారంతా తమ పేరుమీదే ఆ బ్రాండ్స్‌ను నడపడం లేదు. మొత్తంమీద తెలుగులో 'సైరా నరసింహారెడ్డి', 'దటీజ్ మహాలక్ష్మి'.. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కొహ్లీ తెలుగులో చేస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీలతో తమన్నాబిజీగా ఉంది. మరి సినిమాలలో రాణించినట్టే వ్యాపార రంగంలోనూ మిల్కీ బ్యూటీ రాణించాలని కోరుకుందాం