సినిమా వార్తలు

చిరంజీవి 152వ సినిమాలో తమన్నా?


1 year ago చిరంజీవి 152వ సినిమాలో తమన్నా?

మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి 152వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తారన్న విషయం తెలిసిందే.  కొరటాల శివ ‘భరత్ అనే నేను’ చిత్రంతో ఇండస్ట్రీ లో విజయాన్ని దక్కించుకున్నారు. ఇలాంటి సమయంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటించనున్నారనే వార్తలు వెలుడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగా కొరటాల శివ ఒక అద్బుతమైన సోషల్ మెసేజ్ ఉన్న ఒక కథను సిద్దం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ చిత్రం షూటింగ్ ను ఈ సంవత్సరం చివర్లోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం హీరోయిన్ గా తమన్నా పేరును కొరటాల పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిరంజీవి గతంలో తమన్నాతో నటించాలని కోరుకుంటున్నాను అని కామెంట్ చేశారు. అందుకే కొరటాల కూడా చిరంజీవి ఆసక్తి మేరకు తమన్నాతో చర్చలు జరిపారని తెలుస్తోంది. దీంతో ఈ చిత్రంలో తమన్నా దాదాపుగా ఖరారు అయినట్లే అంటూ మెగా ఫ్యాన్స్ లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో ఒక కీలక పాత్రలో తమన్నా నటిస్తున్న విషయం తెలిసిందే.