సినిమా వార్తలు

ద‌స‌ర సెల‌వుల‌కు సైరా సంద‌డి


8 months ago ద‌స‌ర సెల‌వుల‌కు సైరా సంద‌డి

చిరంజీవి క‌థానాయ‌కుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతున్న విష‌యం విదిత‌మే. ఈ సినిమాకి చరణ్ నిర్మాత. చిరంజీవి ప్రాజెక్టులను గురించి తాజాగా ఆయన స్పందిస్తూ .. "ప్రస్తుతం షూటింగు జరుపుకుంటన్న 'సైరా'మరో రెండు నెలల్లో పూర్తి కానుంది దసరా సెలవుల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నాం. నాన్నగారి త‌దుప‌రి సినిమాకొరటాల శివ దర్శకత్వంలో ఉంటుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. వేసవి సెలవుల్లో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే ఉద్దేశంతో వున్నాం. ఇక ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్టు పట్టాలపైకి వెళుతుంది" అని అన్నారు.  కాగా చరణ్ హీరోగా రూపొందిన 'వినయ విధేయ రామ' ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.