సినిమా వార్తలు

'సైరా' మరో ఆరు నెలల వాయిదా?


10 months ago 'సైరా' మరో ఆరు నెలల వాయిదా?

మొదటి నుంచి కూడా పలు కారణాలతో 'సైరా' షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. భారీ సెట్ల నిర్మాణం, అనుకున్న సమయానికి పూర్తికాకపోవడం .. చారిత్రక నేపథ్యం కలిగిన కథా వస్తువు కావడం వలన అనుకున్నంత వేగంగా షూటింగ్ జరగడంలేదని తెలుస్తోంది. దాంతో దర్శక నిర్మాతలు ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయాలని భావించారు. అయితే ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందనేది తాజా సమాచారం. ఈ సినిమాకి భారీస్థాయిలో గ్రాఫిక్స్ అవసరమవుతాయి. అనుకున్న స్థాయిలో అవుట్ పుట్ రావాలంటే 6 నెలలు వేచి వుండవలసిందేనని సురేందర్ రెడ్డి చెప్పారని తెలుస్తోంది. దాంతో ఈ సినిమాను వేసవికి విడుదల చేయడం కష్టమే అవుతుంది గనుక, దసరా సెలవుల్లో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారని సమాచారం. సెలవుల్లో అయితే రిపీట్ ఆడియన్స్ కూడా ఎక్కువగా వుంటారనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు.