సినిమా వార్తలు

క్లైమాక్స్ చిత్రీకరణలో 'సైరా'


11 months ago క్లైమాక్స్ చిత్రీకరణలో 'సైరా'

చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' రూపొందుతున్న విషయం విదితమే. బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన  'ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి'గా ఈ సినిమాలో చిరంజీవి నటిస్తుననారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జార్జియాలో జరుగుతోంది. ప్రధాన పాత్రధారులంతా పాల్గొనగా కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ప్రస్తుతం అక్కడ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరిగుతోంది. హాలీవుడ్ స్థాయిలో ఈ సన్నివేశాలను చిత్రీకరించడం కోసం భారీస్థాయిలో ఖర్చు చేస్తున్నాన్నారని సమాచారం. ఆంగ్లేయ సైన్యంపై నరసింహా రెడ్డి .. ఆయన అనుచర గణం విరుచుకుపడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయనీ, ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురువు గోసాయి వెంకన్నగా అమితాబ్ నటిస్తున్నారు, ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, విజయ్ సేతుపతి, సుదీప్ తదితరులు కనిపించనున్నారు.