సినిమా వార్తలు

షూటింగ్ ద‌శ‌లోనే అంచనాలను మించిన‌ సైరా


11 months ago షూటింగ్ ద‌శ‌లోనే అంచనాలను మించిన‌ సైరా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న  సైరా నరసింహా రెడ్డి చిత్రాన్ని దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాంచరణ్ ఈ చిత్ర నిర్మాణ భాద్యతలు చూసుకుంటున్నాడు. దేశంలో అన్ని చిత్ర పరిశ్రమల నుంచి అతిరథ మహారధులు లాంటి నటులంతా ఈ చిత్రంలో భాగస్వాములు అవుతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి, కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తమన్నా, ప్రగ్య జైస్వాల్ వంటి అందాల తారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బ్రిటిష్ కోటపై దండయాత్ర బ్రిటిష్ కోటపై దండయాత్ర కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగర శివారులో 35 రోజుల పాటు భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. బ్రిటిష్ కోటాపై సైరా నరసింహా రెడ్డి దండెత్తే పోరాట సన్నివేశం అది. వందలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య మెగాస్టార్ చిరంజీవి రేయింబవళ్లు కష్టపడ్డార‌ని స‌మాచారం. దీన్ని తలదన్నేలా మరో పోరాట సన్నివేశం ఉండనుంది. ఒక్క సీన్ కోసం 45 కోట్లు ఒక్క సీన్ కోసం 45 కోట్లు సైరా చిత్ర యూనిట్ జార్జియాలో భారీ షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో భారీ యుద్ధ సన్నివేశం చిత్రీకరించబోతున్నార‌ని తెలుస్తోంది. ఈ ఒక్క యుద్ధం ఖర్చు అక్షరాలా 45 కోట్లు. అంతా భారీస్థాయిలో ఈ పోరాట సన్నివేశం ఉండనుంది.  హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ ఈ చిత్రం కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ పనిచేస్తున్నారు.