సినిమా వార్తలు

ఒకేరోజు ‘సైరా’, ‘సాహో’ విడుదల?


11 months ago ఒకేరోజు ‘సైరా’, ‘సాహో’ విడుదల?

భారీ స్థాయిలో త్వరలో విడుదల కానున్న చిత్రాల్లో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ ఉన్నాయి. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కానున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ‘సైరా’ చిత్రం రాబోయే సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని 2019 ఆగస్ట్‌ 15కు వాయిదా వేసినట్లు సమాచారం. మరోపక్క ‘సాహో’ చిత్రాన్ని కూడా ఆగస్ట్‌ 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రాల విడుదల గురించి ఇరు చిత్రబృందాల నుంచి స్పష్టత రావాల్సివుంది. ‘సైరా’ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. అమిత్‌ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే ‘సాహో’ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.