సినిమా వార్తలు

ఆసక్తికరంగా 'ఎన్జీకే' టీజర్


7 months ago ఆసక్తికరంగా 'ఎన్జీకే' టీజర్

హీరో సూర్య కథానాయకునిగా 'ఎన్జీకే' (నంద గోపాల కృష్ణ ) రూపొందుతోంది. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో సూర్య సరసన రకుల్, సాయిపల్లవి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ, తెలుగు టీజర్లను విడుదల  చేశారు. సూర్య పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయనే విషయం ఈ టీజర్ ను చూస్తేఅర్థమవుతుంది. సూర్య పాత్రకి సంబంధించి పూర్తి భిన్నమైన సన్నివేశాలపై ఈ టీజర్ ను రూపొందించడంతో సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రకుల్ తో పాటు సాయిపల్లవికి తెలుగులో మంచి క్రేజ్ ఉండటం ఈ సినిమాకి కలిసొచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలిచిపోతుందనే నమ్మకంతో సూర్య వున్నారు. ఆయన అభిమానులు కూడా అదే ఆశతో వున్నారు. అయితే వారి నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో వేచిచూడాలి.