సినిమా వార్తలు

మార్చి 1న 'సూర్యకాంతం' పాట విడుదల


8 months ago మార్చి 1న 'సూర్యకాంతం' పాట విడుదల

'ఒక మనసు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మెగా డాటర్ నిహారిక, కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. తనకి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఆమె కొత్త చిత్రంగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. నిహారిక ప్రధాన పాత్రధారిగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, ఆమెకి జతగా రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం ఒక సాంగ్ ను విడుదల చేశారు. తాజాగా మరో పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. మార్చి 1న  ఈ పాటను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. నిహారిక ఈ చిత్రంలో విలక్షణమైన పాత్రలో కనిపించనున్నదని, ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.