సినిమా వార్తలు

రాజమౌళి సినిమాలో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్లివే!


9 months ago రాజమౌళి సినిమాలో చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్లివే!

ప్రేక్షకులకు రాజ‌మౌళి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. తాను నిర్మించబోయే ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ల్టీస్టార‌ర్ లో వారిని హీరో, విలన్లుగా చూపించబోతున్నారట. కాగా ఈ సినిమాలో రామ్‌చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. వాళ్లిద్ద‌రి మ‌ధ్య బంధ‌మేంటి? అనే విష‌యాల గురించి మీడియా ఆరా తీయగా, ఓ స‌ర్‌ప్రైజింగ్ విష‌యం వెల్లడైంది. ఇందులో ఎన్టీఆర్‌ని ప్ర‌తినాయ‌కుడిగా చూపించ‌బోతున్నారని సమాచారం. ఎన్టీఆర్, రామ్‌చ‌ర‌ణ్‌ల మ‌ధ్య పోరాట సన్నివేశాలు ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అని తెలుస్తోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అంతా వీరిద్ద‌రి వైరం చుట్టూ తిర‌గ‌బోతోంద‌ని సమాచారం‌.

ఓ శ‌క్తిమంత‌మైన ప్ర‌తినాయ‌కుడు, వాడ్ని కొట్టి కాక‌లు తీరిన మొన‌గాడు.. ఇది రాజ‌మౌళి సినిమా ఫార్ములాగా తెలుస్తోంది. జై ల‌వ‌కుశ‌లో ఎన్టీఆర్ ప్ర‌తినాయ‌కుడిగానే క‌నిపించాడు. బ‌హుశా.. ఆ సినిమాలో ఎన్టీఆర్ న‌ట‌న‌.. రాజ‌మౌళిలో ఈ కొత్త ఆలోచ‌న రేకెత్తించి ఉంటుందని అంటున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా కోసం మ‌రింత ఫిట్‌గా త‌యార‌వ్వ‌డానికి ఎన్టీఆర్ క‌స‌ర‌త్తులు చేస్తున్నారని తెలుస్తోంది. న‌వంబ‌రు 18 నుంచి ఈ మ‌ల్టీస్టార‌ర్ ఫిల్మ్ చిత్రీకరణ ప్రారంభం కానుంది.