సినిమా వార్తలు

18న యంగ్ టైగర్ అభిమానులకు సర్‌ప్రైజ్‌


11 months ago 18న యంగ్ టైగర్ అభిమానులకు సర్‌ప్రైజ్‌

యంగ్ టైగర్ ఎన్టీఆర్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అరవింద సమేత’. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి డేట్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. ఈ సందర్భంగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ తన ట్విటర్ ద్వారా ఓ మెసేజ్‌ని అభిమానుల కోసం పోస్ట్ చేసింది. రేపు(మంగళవారం) ఓ సర్‌ప్రైజ్‌ను ఇవ్వనున్నామని ట్వీట్‌లో పేర్కొంది. ‘‘అరవింద సమేత ఆడియో ఆల్బమ్ సప్టెంబర్ 20న డైరెక్ట్‌గా మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తాం. త్వరలో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తాం.

మరో సర్‌ప్రైజ్ మీకోసం రేపు ఇవ్వనున్నాం’’ అని ట్వీట్ చేసింది హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ. కాగా ఈ మూవీ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ‘అనగనగనగా’ అంటూ సాగిన ఈ పాటకు తమన్ మ్యూజిక్ అందించగా.. అర్మన్ మాలిక్ ఆలపించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. ‘తొలిప్రేమ’ చిత్రానికి అద్భుతమైన బాణీలు అందించి ఫామ్‌లోకి వచ్చిన తమన్... అరవింద సమేత చిత్రానికి అదే స్థాయి మ్యూజిక్ అందించినట్టు తొలి సాంగ్‌తోటే కన్ఫామ్ చేసేశాడు. సీతారామశాస్త్రి అందించిన సాహిత్యానికి బలాన్ని చేకూర్చేలా అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ ఇచ్చారు తమన్.