సినిమా వార్తలు

అక్టోబర్ 23న ‘బాహుబలి’ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్?


1 year ago అక్టోబర్ 23న ‘బాహుబలి’ ఫ్యాన్స్ కు సర్‌ప్రైజ్?

బాహుబలి హీరో ప్రభాస్ మరో నెల రోజుల్లో 38వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ప్రభాస్ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఈసారి యంగ్ రెబల్ స్టార్ నుండి సర్‌ప్రైజింగ్ న్యూస్ వస్తుందని అభిమానులు ఆశ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' చిత్రంలో నటిస్తున్న నేపథ్యంలో ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 23న ఈ సినిమాకు సంబంధించి స్పెషల్ టీజర్, ట్రైలర్ లాంటివి విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ ఈ సారి అంతకు మించిన సర్‌ప్రైజ్ ఆశిస్తున్నారు.

మరో వైపు ప్రభాస్ ఫ్యామిలీ కూడా కొన్ని రోజులుగా  బాహుబలికి తగిన జోడీని వెతికే పనిలో బిజీగా ఉందని తెలుస్తోంది. ప్రభాస్ పెళ్లి వార్త అతి త్వరలోనే ఆయన పెదనాన్న కృష్ణం రాజు వెల్లడించనున్నారని సమాచారం. అది కూడా ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న వెల్లడయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కాగా గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయాన్ని వారిద్దరూ ఖండించారు. ఏదిఏమైనప్పటికీ ప్రభాస్ పెళ్లి వార్త త్వరలో వినబోతున్నామని అభిమానుల సంబరపడిపోతున్నారట.